Vastu tips: దక్షిణంఫేసింగ్హౌస్మెయిన్ డోర్ ఏ దిక్కులోఉండాలి..ఉత్తరం రోడ్ ఇల్లు బెడ్రూమ్, కిచెన్ విషయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలు ఇవే..!

Vastu tips: దక్షిణంఫేసింగ్హౌస్మెయిన్ డోర్ ఏ దిక్కులోఉండాలి..ఉత్తరం రోడ్ ఇల్లు బెడ్రూమ్, కిచెన్ విషయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలు ఇవే..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో  మెయిన్​ డోర్​  ఏ దిక్కున ఉండాలి.. ఉత్తరం దిక్కు రోడ్డు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఇబ్బందులు వస్తాయా..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..  ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

  ప్రశ్న: ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉండాలి. దక్షిణ ముఖద్వారంతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ప్రధాన ద్వారం దక్షిణ నైరుతి, దక్షిణ ఆగ్నేయంలలో ఏ దిక్కు కట్టుకోవాలి?

జవాబు: దక్షిణ నైరుతిలో ప్రధాన ద్వారం పెట్టుకోకూడదు. దక్షిణ ఆగ్నేయం లేదా దక్షిణ సెంటర్లో ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చుని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ చెబుతున్నారు.

ప్రశ్న: ఉత్తరం వైపు రోడ్ ఉన్న స్థలంలో, తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండేలా ఇల్లు కట్టుకోవచ్చా? బెడ్రూమ్, కిచెన్ ఎటువైపు ఉంటే బాగుంటుంది?

జవాబు:తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండేలా ఇల్లు కట్టుకోవచ్చు. ఉత్తరం వైపు అయినా మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు. ఈ ఇంటిలో మాస్టర్ బెడ్రూమ్ నైరుతి (పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతి)లో, కిచెన్ ఆగ్నేయంలో ఉండాలని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ సూచిస్తున్నారు.

►ALSO READ | పిల్లలను పెంచడమే కర్తవ్యం.. బాగోగులు మన భాద్యత కాదు.. శ్రీరాముడి విషయంలో విశ్వామిత్రుడు.. అగస్త్యుడు చేసింది కూడా ఇదే..!