గాయం సమయంలో కుంబ్లే, కోహ్లీ భరోసా:
అమిత్ మిశ్రా తన కెరీర్ ముగింపు గురించి మాట్లాడుతూ.. 2017లో ఇంగ్లాండ్‌తో బెంగళూరులో జరిగిన టీ20 మ్యాచ్‌నే తాను భారత్ తరఫున ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో గాయపడకపోతే తాను మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడినని తెలిపాడు. ఆ సమయంలో అనిల్ కుంబ్లే భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఉండగా, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నారు. గాయంతో జట్టుకు దూరమైన సమయంలో.. పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించిన తర్వాత నీకు మళ్లీ జట్టులో ఛాన్స్ కల్పిస్తామని కోహ్లీ, కుంబ్లే తనకు భరోసా ఇచ్చినట్లు మిశ్రా గుర్తు చేసుకున్నారు.
ఫోన్ చేసినా, మెసేజ్ పంపినా నో రెస్పాన్స్:
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తన రీ-ఎంట్రీ గురించి విరాట్ కోహ్లీని సంప్రదించిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అమిత్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా ఫిట్‌గా మారిన తర్వాత నేను కోహ్లీకి ఫోన్ చేశాను.. వారం నుంచి 10 రోజుల్లోగా సమాచారం ఇస్తానని కింగ్ కోహ్లీ నాతో చెప్పాడు. కానీ వారం, రెండు, మూడు వారాలు గడిచినా అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కోహ్లీ ఎత్తలేదని, మెసేజ్‌లు పంపినా రిప్లై ఇవ్వలేదని ఆరోపించాడు. దీంతో తన అంతర్జాతీయ కెరీర్ ఎలాంటి క్లారిటీ లేకుండానే ముగిసిపోయిందని మిశ్రా వాపోయాడు.
చేదు జ్ఞాపకంగా మిగిలిన మిశ్రా కెరీర్:
భారత్ తరఫున టెస్టులు, వన్డేలు, టీ20ల మూడూ ఫార్మాట్లలోనూ రాణించి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన అమిత్ మిశ్రా.. అనుకోని పరిణామాలతో జాతీయ జట్టుకు దూరమయ్యారు. అప్పట్లో కెప్టెన్, కోచ్‌లు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో తనను మానసికంగా బాధిచించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
