కేసీఆర్ ఫామ్‌ హౌస్‌కు నీటి తరలింపు.. క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు

కేసీఆర్ ఫామ్‌ హౌస్‌కు నీటి తరలింపు.. క్షేత్రస్థాయిలో  అధికారుల తనిఖీలు

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీటి తరలింపు వార్తలపై అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. 2026 అక్టోబర్ 22న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర అధికారులు పరిశీలించారు. పాండవుల రిజర్వాయర్ నుంచి పంప్‌హౌస్‌లకు వెళ్తున్న నీటిపై అధికారులు పరిశీలించారు. 

హార్టికల్చర్ డీడీ సువర్ణ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇరిగేషన్ ఈఈ అధికారులు రిజర్వాయర్ నుంచి జోన్ల వారీగా బోరు మోటార్లు, పైపుల ద్వారా పంప్‌హౌస్‌లకు వెళ్తున్న నీటిని పరిశీలించారు. 

కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మించి పాండవుల రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే 58 ఎకరాల్లో పాండురంగ చెరువు తవ్వించారని, 2016కు ముందు అక్కడ ఎలాంటి చెరువు లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

  2017లో దీన్ని పూర్తిచేశాక కొండపోచమ్మ సాగర్​ నుంచి నీళ్లు మళ్లించి, నింపుకుంటున్నారని విమర్శలున్నాయి. . ఇక్కడి నుంచి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోని 3 ఎకరాల బావికి పంప్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఇటీవలే ఆరోపించారు.  

రైతుల పేరుతో రూ.45  కోట్ల 54 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి వంద శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారని,  ఇది కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పరాకష్టగా ఎంపీ చామల అభివర్ణించారు. 

ALSO READ : ఏపీ ఎన్నికలు: పోలీసుల ఎదుటే నామినేషన్ పేపర్లు చించివేత..

ఫామ్ హౌస్ కు నీళ్లు తరళిస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే ఫామ్ హౌస్ అసైన్డ్ భూములపై సర్వే నిర్వహిస్తున్న అధికారులు.. నీటి తరళింపుపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు.