ఏపీ ఎన్నికలు: పోలీసుల ఎదుటే నామినేషన్ పేపర్లు చించివేత.. చోద్యం చూసిన ఖాకీలు !

ఏపీ ఎన్నికలు: పోలీసుల ఎదుటే నామినేషన్ పేపర్లు చించివేత.. చోద్యం చూసిన ఖాకీలు !

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తతలకు వేదికగా మారింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో టీడీపీ శ్రేణులు అరాచ‌కం సృష్టించారు. ఎంపీటీసీ నామినేష‌న్ వేయ‌డానికి వ‌చ్చిన వైసీపీ మ‌హిళా అభ్యర్థి చేతుల్లోంచి నామినేష‌న్ ప‌త్రాలు లాక్కోవడం కలకలం రేపింది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు దారితీసింది.

మార్కాపురం బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను టీడీపీ నాయకులు చించివేశారు. నామినేషన్ పత్రాలు టీడీపీ నాయకులు చించి వేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థి కారును ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. నామినేషన్ అభ్యర్థికి మద్దతుగా వచ్చిన వారిపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు.

ALSO READ : నాలుగు నెలలుగా జీతాలు అందక సమ్మెకు దిగిన నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి ఉద్యోగులు