IND vs NZ: న్యూజిలాండ్‌తో రేపు (2026, అక్టోబర్ 24, శనివారం) జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు ముందు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ (Sitanshu Kotak) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తొలి టీ20లో 226 రన్స్ ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు సంజు శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మ (Abhishek Sharma) లపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే, సోషల్ మీడియాలో (Social Media) జట్టు ఎంపికతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలకు సపోర్ట్ తెలిపారు.
తొలి టీ20లో సంజు శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్‌పై బ్యాటింగ్ కోచ్ కోటక్ మాట్లాడుతూ.. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మొదటి రెండు ఓవర్లలోనే 3,4 సిక్సర్లు కొట్టాలని ఏ బ్యాటర్ అనుకున్నా ఔట్ అవుతారు, వరుసగా 2,3 మ్యాచ్‌ల్లో త్వరగా ఔటైతే జట్టు నుంచి తప్పిస్తారేమోనన్న భయం ఉంటుంది.. కానీ ఆ భయాన్ని, ఒత్తిడిని జయించి సంజు, అభిషేక్ చూపిస్తున్న ఫియర్ లెస్ బ్యాటింగ్ (Fearless Attitude) నన్ను బాగా ఆకట్టుకుంది. పవర్, టాలెంట్, ఇంటెంట్‌లతో పాటు వారి మైండ్ కంట్రోల్ (Mind Control) అద్భుతమని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ (Sitanshu Kotak) కొనియాడారు.
15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ని తుది జట్టులోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కోటక్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నెట్టింట ఎవరికి నచ్చినట్లు వారు డ్రీమ్ 11 టీమ్‌ను సెలక్ట్ చేసుకుంటారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు జట్టు శ్రేయస్సు కోసమేనని పేర్కొన్నాడు. ఇక గాయంతో ఇషాన్ కిషన్ (Ishan Kishan) రెండో టీ20కి దూరమవడంతో, ఆసియా గేమ్స్ నుంచి బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ రేపు (శనివారం) జరగబోయే రెండో టీ20లో అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ సూచించారు.
