శివమ్ దూబేను ముంబైకి ఫ్రీగా ఇచ్చేసి హార్దిక్ని తెచ్చుకోండి.. మాజీ చీఫ్ సెలెక్టర్ కీలక వ్యాఖ్యలు

శివమ్ దూబేను ముంబైకి ఫ్రీగా ఇచ్చేసి హార్దిక్ని తెచ్చుకోండి.. మాజీ చీఫ్ సెలెక్టర్ కీలక వ్యాఖ్యలు

Shivam Dube, Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 (IPL 2027) మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) జట్లకు భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. 2023లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 5వ ట్రోఫీ నెగ్గిన తర్వాత గత మూడు సీజన్లుగా చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ట్రేడింగ్ ద్వారా చెన్నైలోకి తీసుకుని, బదులుగా శివమ్ దూబేను (Shivam Dube) ఇచ్చేయాలని శ్రీకాంత్ ప్రతిపాదించారు.     

పాండ్యా వస్తే సీఎస్‌కే ఆల్‌రౌండర్ దొరికినట్లే: 

తన యూట్యూబ్ ఛానెల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా సీఎస్‌కే జట్టులోకి వస్తే అది జట్టుకు ప్లస్ అవుతుంది. వారి ఆల్‌రౌండర్ స్థానం పూర్తిగా భద్రంగా ఉంటుంది.. హార్దిక్ సారథ్యంలో ముంబై జట్టు నిర్మాణం, ప్రదర్శన విషయంలో చాలా ఇబ్బంది పడింది. కాబట్టి ఈ మార్పు హార్దిక్, ఎంఐ రెండింటికీ మంచిదని క్రిష్ పేర్కొన్నారు.

శివమ్ దూబేపై ఘాటు వ్యాఖ్యలు: 

శివమ్ దూబేను జట్టు నుంచి తప్పించడంపై శ్రీకాంత్ మరింత ఘాటుగా స్పందించారు. నేనే గనుక సీఎస్‌కే యాజమాన్యంలో ఉంటే.. దూబేను ఉచితంగా ఇచ్చేయడానికైనా సిద్ధపడతాను.. అతన్ని విడుదల చేయడానికి నాకు ఎలాంటి ట్రేడింగ్ కూడా అవసరం లేదన్నాడు. దూబేని వేలంలోకి వదిలేసి, అవసరమైతే మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేస్తానని హాట్ కామెంట్స్ చేశాడు. 

ముంబై హెడ్ కోచ్‌గా చంద్రకాంత్ పండిత్: 

* హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ అంశంతో పాటు ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాఫ్‌లో మార్పుల గురించి శ్రీకాంత్ సలహా ఇచ్చారు. 

* ప్రస్తుతం ముంబై హెడ్ కోచ్‌గా ఉన్న మహేళ జయవర్ధనే స్థానంలో భారత్ కి చెందిన దిగ్గజ కోచ్ చంద్రకాంత్ పండిత్‌ను (Chandrakant Pandit) నియమించాలని సూచించారు.

* పండిత్ ముంబైకి చెందిన లోకల్ బాయ్. ముంబై తరఫున ఎంతో క్రికెట్ ఆడటంతో పాటు గొప్ప వ్యూహకర్త.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయే పండిత్ లాంటి కోచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా అవసరని 1983 వరల్డ్ కప్ విజేత క్రిష్ అభిప్రాయపడ్డారు.   

* హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, శ్రీకాంత్ చేసిన ఈ కామెంట్స్ ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.