Prabhas Fauzi Movie: ప్రభాస్‌ లుక్‌పై భారీ క్యూరియాసిటీ.. 'ఫౌజీ' నుంచి డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25!

Prabhas Fauzi Movie: ప్రభాస్‌ లుక్‌పై భారీ క్యూరియాసిటీ.. 'ఫౌజీ' నుంచి డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25!

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ( అక్టోబర్ 23, 2026 )  వేళ అభిమానులకు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. వరుసగా కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతున్న 'కల్కి 2' నుంచి ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

ఇదే క్రమంలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' చిత్రబృందం అదిరిపోయే ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్ పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్లు వెల్లడించి ఆసక్తిని పెంచింది.

ఎవరతను?..

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన 'ఫౌజీ' టీమ్‌..  ఎవరతను? అంటూ ఓ ఆసక్తికరమైన పోస్టును పంచుకుంది. అంతేకాదు, 'డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్: 25' అనే క్యాప్షన్‌తో మరింత ఉత్కంఠను రేకెత్తించింది. ఈ ప్రశ్నకు వీడియోతో సమాధానం లభిస్తుందనే సంకేతాలు ఇవ్వడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ స్పెషల్ వీడియోలో ప్రభాస్ లుక్‌ను పూర్తిగా పరిచయం చేస్తారా? ఆయన పాత్ర నేపథ్యాన్ని వెల్లడిస్తారా? అసలు 'ఫౌజీ'లో డార్లింగ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి. 

ఎలా ఉండబోతున్నారు?

'సీతారామం' వంటి ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘవపూడి.. ఈసారి ప్రభాస్‌తో ఎలాంటి కథను చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పీరియాడిక్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల కానున్న ప్రత్యేక వీడియోతో ఆయన పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.