పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది 'కల్కి 2898 ఏడీ' చిత్రబృందం. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతున్న 'కల్కి 2' నుంచి ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల సందడి మొదలైంది. భైరవగా డార్లింగ్‌ను మరోసారి వెండితెరపై చూడాలన్న ఆసక్తి మరింత పెరిగింది.
భైరవగా ప్రభాస్..
'కల్కి 2'కు సంబంధించిన ఈ వీడియోలో ప్రభాస్‌ను భైరవ పాత్రలో చూపించే దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తొలి భాగంలో తనదైన స్టైల్, యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్.. రెండో భాగంలో ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నాడనే చర్చ మొదలైంది. పుట్టినరోజు వేళ విడుదలైన ఈ వీడియో సీక్వెల్‌పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
భారతీయ సినిమా సూపర్‌హీరోకు, ప్రతి తరంలో అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మరో అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ చిత్రబృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది.
మరింత భారీగా 'కల్కి 2'..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ'లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. భవిష్యత్తు ప్రపంచం, పురాణాల నేపథ్యం, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా భైరవ, అశ్వత్థామ, సుప్రీం యాస్కిన్ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ రెండో భాగంపై ఆసక్తిని పెంచుతోంది.
వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ప్రభాస్ పాత్ర మరింత శక్తిమంతంగా కనిపిస్తుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే షూటింగ్ ప్రారంభ తేదీపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. లేటెస్ట్ వీడియోతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
To the superhero of Indian Cinema… Happy Birthday to the Darling of every generation, Rebel Star #Prabhas. We are excited to embark on another epic cinematic journey with you… #Kalki2898AD ⚡ https://t.co/uE5GQAOr4c
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2026
