కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘అక్క’. రాధికా ఆప్టే విలన్‌గా నటించింది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
సౌత్ ఇండియాలోని పెర్నూరు అనే కల్పిత ప్రాంతంలో 1985 నేపథ్యంలో జరిగిన కథగా దీన్ని పరిచయం చేశారు. ఆ ప్రాంతాన్ని 800 ఏళ్లుగా మహిళలే పరిపాలిస్తున్నారు. ఆ సింహాసనంపై కూర్చున్న వాళ్లను ‘అక్క’ అని పిలుస్తారు. ఇక్కడ మహిళలు ఇళ్లను మాత్రమే కాదు.. వ్యాపారాలను కూడా చూసుకుంటారు. అక్కడ ఎవరు ఎలాంటి అక్రమ వ్యాపారాలు చేసినా అందులో వాటా వీళ్లకు ఇవ్వాల్సిందే. అడ్డు చెపితే చంపేస్తారు. ఆ వీర మహిళలకు లీడర్‌గా భవాని (కీర్తి సురేష్) కనిపించింది.
బొంబాయికి చెందిన పవర్‌ఫుల్ ఉమెన్ రుద్ర (రాధికా ఆప్టే) కన్ను ఆ ప్రాంతంపై పడింది. ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. పవర్ కోసం ఒకరు, లెగసీని కాపాడుకునేందుకు మరొకరు. ఇందులో విజయం ఎవరిది అనేది మిగతా కథ. తన్వి అజ్మి, మహేష్ మంజ్రేకర్, అన్షుమన్ పుష్కర్, మోనికా పన్వార్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
