హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించాలని టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌డబ్ల్యూయూ కూటమి నేతలు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబును గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు.
వారి విజ్ఞప్తిపై స్పందించిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్.. రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, పెండింగ్ బకాయిల చెల్లింపుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కూటమి నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, రావు, మల్లేశ్ పాల్గొన్నారు.
