వెరైటీ చట్నీ: సూపర్ చట్నీ.. జామకాయ పచ్చడి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది..ఎలా తయారు చేయాలంటే..!

వెరైటీ చట్నీ: సూపర్ చట్నీ..  జామకాయ పచ్చడి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది..ఎలా తయారు చేయాలంటే..!

ఒక్కసారి తింటే  చాలు.. మళ్లీ మళ్లీ కావాలంటారు.  సాధారణంగా గోవా ఫ్రూట్​ ను అదే నండి జామకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసినా ఉప్పు.. కారం అద్దుకొని తింటారు.  మరి అలాంటి జామకాయ చట్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.  

ఇది వినడానికి కొత్తగా ఉన్నా నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా తగిలే జామకాయ పచ్చడిని వేడి వేడి అన్నం...  కరకరలాడే పరాటాల్లోకి ఈ పచ్చడి అద్భుతమైన కాంబినేషన్. ఆవనూనె ఘాటు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో ఈ పచ్చడిని  పది నిమిషాల్లో  తయారు చేసుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం. . .!

జామకాయ పచ్చడి తయారీకి  కావలసినవి

  •  గట్టి,దోర జామకాయలు: కేజీ
  •  ఆవ నూనె: 8 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు: 2  టీస్పూన్లు 
  • సోంపు గింజలు: 2 టీస్పూన్లు
  •  మెంతులు: ఒక టీస్పూన్ 
  • నల్ల జీలకర్ర: ఒక టీస్పూన్
  •  ఇంగువ: అర టీస్పూన్ 
  • పసుపు: 2 టీస్పూన్లు
  • ఎర్ర కారం: 2టీస్పూన్లు
  •  ఆమ్చూర్ పొడి: 2 టీస్పూన్లు లేదా
  • నిమ్మరసం : 4 టీస్పూన్లు 
  • బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా

జామకాయ పచ్చడి తయారీ విధానం

జామకాయలను ముందుగా  నీటితో శుభ్రంగా కడగి.. తడి లేకుండా ఆరబెట్టాలి.  ఆ తరువాత ఆ రాయలను చతురాస్రాకార రూపంలో చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేయాలి. తినేటప్పుడు గింజలు తగలకూడదనుకుంటే  గింజలను తీసేయండి. వీటిని ఒక బౌల్​లోకి తీసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై కళాయి పెట్టి అందులో సోంపు గింజలు.. మెంతులు.. ఆవాలు వేసి సన్నని మంటపై  దోరగా వేగించాలి. వీటన్నింటిని ఒరబౌల్​ లో చల్లారబెట్టాలి.  అవి చల్లారిన తరువాత  మిక్సీలో కొద్దిగా బరకగా ఉండేలా పొడి చేయాలి. 

ALSO READ : తులారాశిలో బుధుడు తిరోగమనం.. ఏరాశి వారికి ఎలా ఉంటుంది..

ఇప్పుడు మళ్లీ స్టవ్​ వెలిగించి.. కళాయి పెట్టి అందులో ఆవనూనె పోసి పచ్చి వాసన పోయే వరకు .. పొగలు వచ్చే వరకు బాగా వేడి చేయాలి.  తరువాత స్టవ్​ ఆ నూనెను గోరు వెచ్చగా ఉండే వరకు ఆరపెట్టాలి. ఇప్పుడు ఇందులో  నల్ల జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, ఉప్పు, నల్ల ఉప్పు, ముందుగా మిక్సీలో చేసుకున్న  (ఆవాలు, మెంతులు, సోంపు) పొడి  వేసి కలపండి.

ఇప్పుడు జామకాయ ముక్కలు, ఆమ్​ చూర్​ పొడి లేదా నిమ్మరసం   ఆ మిశ్రమంలో కలపాలి.  ప్రతి ముక్కకు బాగా ఈ పొడి పట్టేలాకలపండి.ఇక -అంతే నోరూరించే ఆరోగ్యాన్ని ఇచ్చే  ఇన్‌స్టంట్ జామకాయ పచ్చడి రెడీ.  జామకాయల్లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.