- ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్
మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతన జగన్మోహన్ రావుతో కలిసి పని చేస్తానని జిల్లా ఆర్టీఏ కమిటీ మెంబర్ అంకతి శ్రీనివాస్ తెలిపారు. గురువారం మంచిర్యాలలోని జగన్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రావు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన అంకతి శ్రీనివాస్ గతంలో యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గా, పెరిక సంఘం యూత్ జిల్లా ప్రెసిడెంట్గా పని చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా గుర్తింపు పొందారు. ఇప్పటికే లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు జగన్మోహన్ రావుతో కలిసి పని చేస్తామని ప్రకటించగా, తాజాగా అంకతి శ్రీనివాస్ కూడా రావడంతో ఉత్సాహం నెలకొన్నది.
