ఆదిలాబాద్ లో గత కొంతకాలంగా మూతపడిన సీసీఐ బిల్డింగ్ ను కూల్చేశారు అధికారులు. గురువారం ( అక్టోబర్ 22 ) భారీ ట్యాంకులను బ్లాస్టింగ్ తో కూల్చేశారు అధికారులు. సినిమా సీన్ తరహాలో క్షణాల్లో ట్యాంకులు నేలమట్టమైన వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు ఐదు వేల మందికి ఉపాధినిచ్చిన సంస్థ ఇప్పుడు ఇలా నేలకూలడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంస్థలో పని చేసిన ఉద్యోగులు, స్థానికులు.
ఇవాళ బారీ ట్యాంకుల బ్లాస్టింగ్ తో సీసీఐ బిల్డింగ్ పూర్తయ్యిందని తెలిపారు అధికారులు. భారీ నష్టాలతో కొన్నేళ్ల క్రితం మూతపడింది సీసీఐ సంస్థ. పరిశ్రమలో ఇనుప సామాగ్రిని తొలగించిన అధికారులు బిల్డింగ్ కూల్చివేత చేపట్టారు. జిల్లాకు ఐకాన్ గా నిలిచినా సంస్థను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
1982లో ఆదిలాబాద్ శివారులో 807 ఎకరాల్లో సీసీఐ సంస్థ ప్రారంభం అయ్యింది. రోజుకు 12వేల టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో దీనిని నిర్మించగా... 1984లో ఈ పరిశ్రమలో సిమెంట్ ఉత్పత్తి మొదలైంది. అప్పటి నుంచి ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సుమారు ఐదు వేల కుటుంబాలు జీవనం సాగించేవి.
ALSO READ : బతుకమ్మ ఆడకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు..
అయితే... అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిన సమయంలో సీసీఐకి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఉపసంహరించుకుంది. దీంతో నష్టాల్లో పడిపోయింది సీసీఐ. 1996లో మొదలైన నష్టాలు 2008కి బాగా పెరగడంతో సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు ఈ కూల్చివేతతో సీసీఐ పూర్తిగా కనుమరుగయ్యింది.
