హనీ వరల్డ్ రికార్డు.. జావెలిన్‌లో గోల్డ్, భారత్ ఖాతాలో 100 మెడల్స్!

హనీ వరల్డ్ రికార్డు.. జావెలిన్‌లో గోల్డ్, భారత్ ఖాతాలో 100 మెడల్స్!

Haney Javelin Gold: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో ఐదో రోజు భారత అథ్లెట్లు ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ పతకాల వర్షం కురిపించారు. జపాన్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తూ భారత్ ఖాతాలో 100 పతకాల మైలురాయిని దాటేసింది. ప్రస్తుతానికి ఇండియా దగ్గర 27 స్వర్ణాలు, 33 రజతాలు, 43 కాంస్యాలతో మొత్తం 103 పతకాలని కైవసం చేసుకుంది. దీంతో పతకాల పట్టికలో టీమిండియా 4వ స్థానంలో కొనసాగుతోంది. 2023 హాంగ్‌జౌ గేమ్స్‌లో సాధించిన ఆల్-టైమ్ రికార్డు 111 పతకాలను దాటే దిశగా భారత క్రీడాకారులు అడుగులు వేస్తున్నారు.

వరల్డ్ రికార్డులతో హనీ, సందీప్‌లకి స్వర్ణాలు: 

* ఈరోజు (2026, అక్టోబర్ 23, శుక్రవారం) నాటి పోటీల్లో భారత పారా అథ్లెట్లు ప్రపంచ రికార్డులను తిరగరాశారు. 

* హనీ జావెలెన్ రికార్డు (60.49m): పురుషుల జావెలెన్ త్రో F37/38 ఈవెంట్ ఆఖరి ప్రయత్నంలో హనీ (Haney Shatters) ఏకంగా 60.49 మీటర్ల దూరానికి ఈటెను విసిరి సరికొత్త ప్రపంచ రికార్డుతో పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు డిస్కస్ త్రోలోనూ ఇతడు బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు.

* సందీప్ 400 మీటర్ల వరల్డ్ రికార్డ్: పురుషుల 400 మీటర్ల T64 విభాగంలో సందీప్ 52.28 సెకన్ల టైమింగ్‌తో ప్రపంచ రికార్డును నెలకొల్పి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఈ రేసులో భారత్‌కే చెందిన అజయ్ కుమార్ (53.61 సెకన్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 

బ్యాడ్మింటన్, ఆర్చరీలోనూ పసిడి మెరుపులు: 

* పారా బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ SL3 ఫైనల్లో నితేష్ కుమార్ 21–18, 21–16 తేడాతో సహచర ఇండియన్ ప్లేయర్ ప్రమోద్ భగత్‌ను ఓడించి స్వర్ణం గెలవగా, ప్రమోద్‌కి రజతం లభించింది. SL4 ఫైనల్లో నవీన్ శివకుమార్ 21–9, 21–17తో ఇండోనేషియా ప్లేయర్‌ను చిత్తు చేసి మరో గోల్డ్ అందించాడు.

* పారా ఆర్చరీ: పురుషుల రికర్వ్ డబుల్స్ ఫైనల్లో హర్విందర్ సింగ్ - విజయ్ సుండి ద్వయం 5–1 తేడాతో చైనాను ఓడించి గోల్డ్ పతకాన్ని కైవసం చేసుకుంది.

రజత, కాంస్య పతకాల పంట: 

* రజత పతకాలు (Silver): 

* తులసీమతి మురుగేశన్ (మహిళల SU5 బ్యాడ్మింటన్), 
* నిత్య శ్రీ సుమతి (మహిళల SH6 బ్యాడ్మింటన్), 
* ప్రమోద్ బిజర్నియా (పురుషుల 1500m T46), 
* నిమిష సురేష్ (మహిళల లాంగ్ జంప్ T47), 
* పూజా జత్యన్-భావన చౌదరి (విమెన్స్ రికర్వ్ డబుల్స్ ఆర్చరీ) రజత పతకాలు సాధించారు. 

కాంస్య పతకాలు (Bronze): 

* కాంస్య పతకాలు (Bronze): జెహాన్ మదన్ - శుభం వాధ్వా ద్వయం పారా టేబుల్ టెన్నిస్ (Class MD4) విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు.