హైదరాబాద్: బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన దక్షిణాది డీజీపీల కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్‌ను మొత్తం నాలుగు కమిషనరేట్స్‌గా చేసి అత్యుత్తమ సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
నార్కోటిక్స్, సైబర్ నేరాలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్‌ల పనితీరుకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
పోలీసు సిబ్బంది భద్రతకు అత్యంత ప్రధాన ఇస్తున్నామని, వారి పిల్లల చదువులకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ తీసుకొచ్చామని చెప్పారు. పోలీసు సిబ్బంది మరణిస్తే వారికి ఆర్ధిక సహాయంతో పాటు వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, దక్షిణాది రాష్ట్రాల పోలీసులు పరస్పర సహకారం ఉంటే నేరాలు పూర్తి స్థాయి కట్టడికి అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
