గాల్లోకి ఎగిరిన 2 నిమిషాల్లోనే.. శంషాబాద్ లో విమానం అత్యవసరం ల్యాండింగ్

గాల్లోకి ఎగిరిన 2 నిమిషాల్లోనే.. శంషాబాద్ లో విమానం అత్యవసరం ల్యాండింగ్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.శుక్రవారం ( అక్టోబర్ 23 ) శంషాబాద్ నుంచి ముంబైకి బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ తీసుకుంది. సాంకేతిక లోపం గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్ తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

విమానం టేకాఫ్ అయిన సమయంలో 109 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పైలట్ సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు అధికారులు. విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే పైలట్ సాంకేతిక లోపం గుర్తించారని.. ఆలస్యం చేయకుండా అప్రమత్తం చేశారని అంటున్నారు.

ALSO READ : సౌదీ ఎయిర్పోర్టుపై హౌతీల దాడి..

విమానంలో తలెత్తిన సమస్య గురించి ATC అధికారులకు సమాచారం అందించానని... అధికారులు పరిస్థితిని సమీక్షించి విమానాన్ని తిరిగి శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్ చేసేలా సూచనలు చేశారని తెలిపారు పైలట్. ప్రస్తుతం విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈ ఘటనతోఎయిర్ పోర్టులో కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది.