అహ్మదాబాద్ : తొలి కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పురుషుల విభాగంలో ఇంగ్లండ్‌తో, మహిళల విభాగంలో మలేసియాతో భారత్ తొలి మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 23 నుంచి 31 వరకు వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ పోటీల్లో 13 దేశాలకు చెందిన 23 జట్లు పాల్గొంటున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 62 మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషుల విభాగంలో 13 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-ఏలో భారత్‌తో పాటు నైజీరియా, మలేసియా, ఉగాండా, ఇంగ్లండ్, టాంజానియా, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, కెన్యా, కెనడా, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, సింగపూర్ జట్లు ఉన్నాయి. భారత పురుషుల జట్టుకు సుర్జీత్ సింగ్ కెప్టెన్‌గా, నవీన్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మహిళల విభాగంలో భారత్ గ్రూప్-ఏలో సింగపూర్, నైజీరియా, ఉగాండా, మలేసియాతో తలపడనుంది. ఈ జట్టుకు నిధి శర్మ కెప్టెన్‌గా, రీతూ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. అక్టోబర్ 30న సెమీఫైనల్స్, 31న పురుషులు, మహిళల ఫైనల్స్ నిర్వహిస్తారు.
