వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘నా వైఫ్ మిస్సింగ్’. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించగా, శివ కంఠంనేని నిర్మించారు. గురువారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీమియర్, ప్రెస్‌మీట్‌కు దర్శకుడు హరీశ్ శంకర్, సీనియర్ నటుడు మురళీమోహన్ అతిథులుగా హాజరై ‘కొత్త బంగారు లోకం’ తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు నటించిన ఈ సిరీస్ ఆ సినిమా తరహాలో పెద్ద విజయం సాధించాలని కోరారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘ఏ రిలేషన్‌లో అయినా పరస్పర నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకమే బంధాన్ని నిలబెడుతుందనే అని ఈ సిరీస్ తెలియజేస్తుంది’ అని చెప్పాడు. ఇది నాకు గ్రేట్ కంబ్యాక్ అని ఫీల్ అవుతున్నా అని శ్వేతాబసు ప్రసాద్ చెప్పింది.
ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సిరీస్ ఇదని డైరెక్టర్ స్వాతిప్రకాష్ చెప్పారు. మంచి టీమ్‌తో చేసిన ఈ సిరీస్ అందరికీ నచ్చేలా ఉంటుందని ప్రొడ్యూసర్ శివ కంఠంనేని అన్నారు. నటి సత్య శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
