పి.ఎస్.జె ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మిస్తున్న చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.వి. నారాయణరావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా, యు/ఎ సర్టిఫికెట్ లభించింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మురళీ మోహన్, టీజర్‌ను విజయేంద్ర ప్రసాద్, పాటను చిన్న జీయిర్ స్వామి, మరో పాటను అక్కినేని అమల విడుదల చేశారు. సమాజంలో జరిగే కొన్ని వాస్తవిక సంఘటనలు, స్నేహాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించామని, లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అనే ఒక కాన్సెప్ట్‌ను ఇందులో ప్రజెంట్ చేసినట్టు నిర్మాతలు తెలియజేశారు.
