అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... అరబిందో ఫార్మాలో చెలరేగిన మంటలు..

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... అరబిందో ఫార్మాలో చెలరేగిన మంటలు..

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ఉన్న అరబిందో ఫార్మా పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శుక్రవారం ( అక్టోబర్ 23 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... అరబిందో ఫార్మా పరిశ్రమ యూనిట్ 15 ప్రొడక్షన్ బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటల సమయంల ప్రొడక్షన్ బ్లాక్ నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. 

ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, లేదా కెమికల్ రియాక్షన్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పరుగులు తీసిన షిఫ్ట్ లో ఉన్న ఉద్యోగులు. 

తెల్లవారుజామున కావడంతో షిఫ్ట్ లో తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు అధికారులు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా సిబ్బంది నిర్లక్ష్యం కారణమా అన్నది విచారణ చేపట్టి బాద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.