నందలూరు: కడప జిల్లా నందలూరులో కాల్పుల కలకలం రేగింది. నామినేషన్ విషయంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గాల్లోకి కాల్పులు జరిపింది. మేడా విజయశేఖర్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఆయన టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో వాగ్వాదం జరిగింది.
టీడీపీ వర్గం నేతలు విజయశేఖర్రెడ్డిపై దాడి చేశారు. టీడీపీ వర్గీయులు విజయశేఖర్ రెడ్డికి చెందిన కారును తగలబెట్టారు. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకున్నారు. టీడీపీ నేత, తిరుపతి ఎలైట్ హాస్పిటల్ అధినేత బాలసుబ్రమణ్యం గన్‌తో కాల్పులు జరపడంతో నందలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
