ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో 22వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. పరిశ్రమలు, పర్యాటకం, ఇంధనం, ఐటీ కమ్యూనికేషన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎస్ఐబీసీలో ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు, అధికారులు వర్చువల్గా హాజరయ్యారు.
గతంలో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలు సాకారమై ఉత్పత్తి ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్ రైల్ కనెక్టివిటీతో పాటు తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. సెమీ కండక్టర్ల రంగంలో ఏపీలో తయారీ ఎకోసిస్టమ్ రావాలని సీఎం సూచించారు.
