పదో తరగతి పరీక్షల ఫీజుల షెడ్యూల్ విడుదల.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

పదో తరగతి పరీక్షల ఫీజుల షెడ్యూల్ విడుదల.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల వివరాలు వెల్లడించింది విద్యాశాఖ. 2027-మార్చి లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన ఫీజుల షెడ్యూల్ ను 2026 అక్టోబర్ 22న విద్యాశాఖ విడుదల చేసింది. ఫీజులు అక్టోబర్ 30వ తేదీ నుంచి చెల్లించవచ్చునని పేర్కొంది.

ఎలాంటి లేట్ ఫీజు లేకుండా  అక్టోబర్ 30 – నవంబర్ 16 వరకు చెల్లించవచ్చు. ఆ గడువు దాటితే 50 రూపాయల లేట్ ఫీజుతో  నవంబర్ 18 – డిసెంబర్ 1 వరకు చెల్లించవచ్చు. ఆ గడువులోపు కూడా చెల్లించలేక పోతే 200 రూపాయల లేట్ ఫీజుతో  డిసెంబర్ 3 – డిసెంబర్ 14 మధ్య ఫీజులు కట్టవచ్చు.

చివరగా 500 రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 16 – డిసెంబర్ 28 వరకు ఫీజులు చెల్లివచ్చునని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

ALSO READ : కేసీఆర్ ఫామ్‌ హౌస్‌కు నీటి తరలింపు.. క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు

 రెగ్యులర్ విద్యార్థులకు ఫీజు రూ.125 గా నిర్ధారించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజు నుంచి మినహాయించారు. నిర్ణీత గడువు లోపు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత గడువు పొడిగించే అవకాశం ఉండదని డీజీఈ స్పష్టం చేశారు. 

ఫీజులను bse.telangana.gov.in లో ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. 

ఫీజుల షెడ్యూల్:

  • లేట్ ఫీజు లేకుండా: అక్టోబర్ 30 – నవంబర్ 16
  • రూ.50 లేట్ ఫీజుతో: నవంబర్ 18 – డిసెంబర్ 1
  • రూ.200 లేట్ ఫీజుతో: డిసెంబర్ 3 – డిసెంబర్ 14
  • రూ.500 లేట్ ఫీజుతో: డిసెంబర్ 16 – డిసెంబర్ 28
  • రెగ్యులర్ విద్యార్థులకు ఫీజు రూ.125