చిత్తూరు: కాణిపాకం వినాయకుడి హుండీ లెక్కింపు.. 16 రోజుల ఆదాయం.. రూ. 95 లక్షలు

చిత్తూరు:  కాణిపాకం వినాయకుడి హుండీ లెక్కింపు.. 16 రోజుల ఆదాయం.. రూ. 95 లక్షలు

చిత్తూరు కాణిపాకం వినాయకుడి హుండీని లెక్కించారు.16 రోజుల్లో రూ. 95  లక్షలకు పైగా కానుకలు వచ్చాయని అధికారులు తెలిపారు. 

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. 16 రోజుల్లో  రూ. 95 లక్షల రూపాయిలు ఆదాయం వచ్చింది.  ఇంకా బంగారం, వెండితో పాటు అన్నదానానికి విరాళాలు అందాయి. 

చిత్తూరు కాణిపాకం వినాయక స్వామికి హుండీలో  16 రోజుల కానుకలను దేవస్థానం అధికారులు గురువారం ( అక్టోబర్​ 22) లెక్కించారు.ఈ లెక్కింపులో స్వామివారి ప్రధాన హుండీ ద్వారా 95 లక్షల 12 వేల 839 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.నగదుతో పాటు మూడు గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించారు.

గోసంరక్షణ హుండీ ద్వారా 7 వేల 451 రూపాయలు, నిత్య అన్నదాన హుండీ ద్వారా లక్షా 59 వేల 85 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో పెంచల కిషోర్, డీఈవో సాగర్ బాబు వెల్లడించారు. చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఆలయ ఏఈవోలు, పర్యవేక్షకులు, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం ఉద్యోగులు, సేవకుల సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.