కరీంనగర్-జగిత్యాల హైవేపై జగిత్యాల డిపో సూపర్ లగ్జరీ బస్సు బీభత్సం

కరీంనగర్-జగిత్యాల హైవేపై జగిత్యాల డిపో సూపర్ లగ్జరీ బస్సు బీభత్సం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై జగిత్యాల డిపో సూపర్ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్‌లో వచ్చిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

బైక్‌పై ఉన్న హిరలాల్, అతని 4 ఏళ్ల కుమారుడు సంస్కార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తండ్రీకొడుకులకు ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గంగాపూర్ గ్రామానికి చెందిన జాడి అజయ్ (26) అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకునికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.