Beauty tips:పాదాల అందం.. ఇంట్లోనే పెడిక్యూర్.. ఎలా చేయాలంటే..!

Beauty tips:పాదాల అందం.. ఇంట్లోనే పెడిక్యూర్.. ఎలా చేయాలంటే..!

పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పెడిక్యూర్ తప్పనిసరి. దీనికోసం పార్లర్​ కేం వెళ్లాల్సిన పనిలేదు. వంటింట్లో అందుబాటులో ఉండే పదార్థాల తోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. అదెలాగంటే... 

పెడిక్యూర్ కోసం ముందుగా గోళ్లకున్న నెయిల్ పాలిష్ ను పూర్తిగా తీసేయాలి. ఆ తరువాత గోళ్లని మంచి షేప్ లో కట్ చేయాలి. ఇప్పుడు టబ్బు సగం వరకు గోరువెచ్చని నీళ్లు పోసి అందులో కొద్దిగా షాంపూ, రాళ్లుప్పు, రోజ్​ వాటర్, గుండ్రంగా తరిగిన నిమ్మకాయ ముక్కలు వేయాలి. ఆ నీళ్ల వేడి తగ్గేవరకు పాదాల్ని అందులో ఉంచి.. తరువాత బయటకు తీయాలి.

ALSO READ : మైండ్ ఫుల్ నెస్ టెక్నిక్.. జీవితం అంటే అస్సలు భయం ఉండదు..!

 తడి పూర్తిగా పోయాక పాదాలపై మృతకణాలు తొలగించడానికి రెండు టీ స్పూన్ల చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా ఆలివ్​నూనె తీసుకుని బాగా కలిపి ప్యాక్ లా వేసుకోవాలి. పూర్తిగా ఆరాక పాదాల్ని కడిగేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుని నచ్చిన నెయిల్ పాలిష్ వేసుకుంటే ఇంట్లోనే పెడిక్యూర్ పూర్తయినట్లే. ఇదే పద్ధతిలో మెనిక్యూర్ కూడా చేసుకోవచ్చు.