మూడేళ్ళ పిల్లలకు లెక్కలు రావాలంటే "పుస్తకాలే పట్టనక్కర్లేదు. అలాగని ఆన్ లైన్ క్లాసులూ అక్కర్లేదు. ముఖ్యంగా ప్రీస్కూ ల్ పిల్లలకు లెర్నింగ్ అనే కాన్సెప్ట్ లేకుండానే మ్యాథ్స్ నేర్పించొచ్చు. అంతెందుకు, మాట్లాడే భాషను పుస్తకాల్లో చూపించి నేర్పట్లేదు కదా.. అలాగే మ్యాథ్స్ ని కూడా స్కూల్లో వన్... టూ.... త్రీ.. అని నేర్చుకోకముందే పరిచయం చేయొచ్చు.
ఇక్కడ మ్యాథ్స్ అంటే లెక్కలు, ఎక్కాలు అని మాత్రం కాదు. రీజనింగ్, ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటివి కూడా దీనికిందికే వస్తాయి. అలాంటి విషయాల్ని చిన్నప్పుడే పిల్లలకు ఈజీగా నేర్పిం చొచ్చు. దానికి కొన్నిరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తే ప్రీస్కూల్ పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. పైగా వాళ్లు ఈ వయసులో నేర్చుకున్నవాటిని ఎప్పటికీ మర్చిపోరు కూడా. ఆ టెక్నిక్స్ ఏంటో పేరెంట్స్ తెలుసుకుని పిల్లలను ఎంకరేజ్ చేయాలి.
డిడక్టివ్ రీజనింగ్
పిల్లలకు పెద్దపెద్ద లాజిక్ లతో ఏదీ చెప్పకూడదు. ఎలాంటి లాజిక్ లనైనా చిన్నచిన్న ఉదాహరణ లతో వివరించాలి. ఉదాహరణకు పిల్లాడి దగ్గర ఎల్లో, గ్రీన్ కలర్స్ లో బొమ్మలు ఉంటే.. ఎల్లో బొమ్మని చూపించి 'ఇది గ్రీన్ కలర్ బొమ్మ కాదు' అని చెప్పాలి. అప్పుడు అది ఎల్లో కలర్ అని వాళ్లకు అర్థమవుతుంది.
అదేవిధంగా గ్రీన్ కలర్బొమ్మని తీసుకుని.. 'ఇది ఎల్లో కలర్ బొమ్మ కాదు' అని చెప్పాలి. దానివల్ల వాళ్లకు గ్రీన్ కలర్ అని మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. మరో ఉదాహరణ ఏంటంటే.. 'పక్షులకు ముక్కులు, రెక్కలు ఉంటాయి. కాకి ఒక పక్షి' అని చెప్పాలి. అప్పుడు వాళ్లకు ఆటోమెటిక్ గా కాకికి ముక్కు, రెక్కలు ఉంటాయని అర్ధమవుతుంది.
క్లాసిఫికేషన్ అండ్ సార్చింగ్
నెంబర్స్ నేర్పించే ముందు పిల్లలకు స్టార్టవుట్ చేయడం చెప్పాలి. అంటే రకరకాల వస్తువులను పిల్లల ముందు వేసి.. ఏయే వస్తువు ఏ కేటగిరిల్లో కి వస్తాయో విడదీయమనాలి. ఉదాహరణకు ఆడుకునే బొమ్మలు, హౌస్‌హోల్డ్ వస్తువులు, కారు యాక్సెసరీలు వంటివి ఒకచోట పెట్టాలి. వాటిని కేటగిరీకి అనుగుణంగా వస్తువులను సెలెక్ట్ చేయమని చెప్పాలి.
అలాగే జంతువులు, పక్షులను కాళ్ల సంఖ్య ఆధారంగా వేరు చేయమని చెప్పాలి. వీటితో పాటు అమ్మమ్మల చీరలు, పెళ్లి ఫొటోల ఆల్బమ్ చూపించి పాత వస్తువులను గుర్తించేలా ట్రెయిన్ చేయాలి. అలాగే కొన్ని వస్తువులను పిల్లల ముందు పెట్టి, ఏ రకం వస్తువులు ఎన్నెన్ని ఉన్నాయో చెప్పడం పేరెంట్స్ స్టార్ట్ చేయాలి. ఇవి పిల్లలకు మ్యాథ్స్ ని ఈజీగా అర్థం చేసుకునేందుకు సాయపడతాయి.
