హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ సవరించిన పాఠ్యపుస్తకాలు, మారిన కరిక్యులమ్ పద్ధతులకు సంబంధించిన వ్యాలిడేషన్ రూల్స్‌పై జూనియర్ లెక్చరర్లకు రెండ్రోజులపాటు ఆన్‌లైన్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 27, 28 తేదీల్లో సబ్జెక్టులవారీగా శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి.
విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ పెంచడంతోపాటు అకడమిక్ ఫలితాలను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్ కాలేజీల పరిధిలోని అన్ని సబ్జెక్టుల లెక్చరర్లు ఈ వెబినార్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
