కృష్ణ కమల్, మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. దర్శకుడు దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికరమైన వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన కాషన్ 1 వీడియోకు మంచి స్పందన రావడంతో, తాజాగా కాషన్ 2 వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రేమ, బాధ్యతలపై హీరోయిన్ అడిగే ప్రశ్నలకు హీరో ఇచ్చే సరదా సమాధానాలు ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా ‘మడమ తిప్పని వంశం మాది... బాలయ్య బాబు టైపు’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. ‘మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి’ అంటూ కాషన్ 1తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మూవీ టీమ్... కాషన్ 2తోనూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ రా అండ్ రస్టిక్ రొమాంటిక్ మూవీ విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు మేకర్స్ తెలిపారు.
