జియో ఐపీఓకు రెస్పాన్స్ సూపర్ రూ.3.68 లక్షల కోట్ల బిడ్లు.. రెండో రోజు 5.3 రెట్ల బిడ్లు దాఖలు

జియో ఐపీఓకు రెస్పాన్స్ సూపర్ రూ.3.68 లక్షల కోట్ల బిడ్లు.. రెండో రోజు 5.3 రెట్ల బిడ్లు దాఖలు
  • రిటైల్ ​పోర్షన్కు 1.5 రెట్ల సబ్​స్క్రిప్షన్
  • దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

ముంబై: జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్స్ రూ.30,200 కోట్ల ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. రెండో రోజు కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. గురువారం నాటికి వచ్చిన బిడ్లు, అంతకుముందు యాంకర్ ఇన్వెస్టర్ల పోర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపి ఈ ఇష్యూకు మొత్తం రూ.3.68 లక్షల కోట్ల విలువైన డిమాండ్ లభించింది. యాంకర్ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్న షేర్ల కంటే 30 రెట్లు అధికంగా బిడ్స్​ వచ్చాయి. ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్ల నుంచి రూ.2.50 లక్షల కోట్ల విలువైన బిడ్లు అందాయి.

జియో గరిష్ట ధర వద్ద 212 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.8,109.85 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. గురువారం సాయంత్రం 5.45 గంటల సమయానికి పబ్లిక్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫర్ చేసిన షేర్ల కంటే 5.3 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. రూ.1,065- రూ.1,119 ప్రైస్ బ్యాండ్ గరిష్ట ధర ప్రకారం లెక్కిస్తే ఇన్వెస్టర్లు రూ.1,18,000 కోట్ల విలువైన షేర్ల కోసం దరఖాస్తు చేశారు.

భారత స్టాక్ మార్కెట్లో రూ.15 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించిన ఐపీఓలలో విలువ పరంగా ఇదే అత్యధిక బిడ్డింగ్ కావడం విశేషం. క్యూఐబీ విభాగంలో 4.9 కోట్ల షేర్లకు గాను 63.05 కోట్ల షేర్లకు బిడ్లు రావడంతో 12.87 రెట్లు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయింది.

నాన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాకు 5.64 రెట్ల స్పందన వచ్చింది. రిటైల్ విభాగంలో 8.5 కోట్ల షేర్లకు గాను 12.77 కోట్ల షేర్లకు దరఖాస్తులు రావడంతో 1.5 రెట్లు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయింది. ఉద్యోగుల కోటా 2.05 రెట్లు, షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్ల విభాగం 3.9 రెట్లు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయ్యాయి. జియో ఐపీఓ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ అక్టోబర్ 23న ముగియనుండగా, అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

సెన్సెక్స్ 460.30 పాయింట్లు డౌన్​ 
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజైన గురువారమూ నష్టాలను చవిచూశాయి.  సెన్సెక్స్ 460.30 పాయింట్లు తగ్గి 73249.39 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 704.58 పాయింట్లు పడిపోయి 73005.11 కనిష్ట స్థాయిని తాకింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 123.70 పాయింట్లు తగ్గి 22687.65 వద్ద స్థిరపడింది. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీజీ, ఐటీ, పవర్ రంగాల షేర్లలో విక్రయాల జోరు సాగింది.

రిలయన్స్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ నష్టపోగా బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ లాభపడ్డాయి.  బ్రెంట్​ ముడి చమురు ధర 3 శాతం పెరిగి 112 డాలర్ల మార్కును దాటింది. ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పి 3.52 శాతం, హాంగ్ సెంగ్ 3.03 శాతం నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు రూ.1022.32 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.