ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు తుల్సా ప్రో టెక్నాలజీ

ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు తుల్సా ప్రో టెక్నాలజీ

హైదరాబాద్, వెలుగు: ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు డీఎస్ఎస్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ కెనడాకు చెందిన ప్రొఫౌండ్ మెడికల్ అభివృద్ధి చేసిన అధునాతన తుల్సా ప్రో టీయూఎల్ఎస్ఏ పీఆర్ఓ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందిస్తోంది. దక్షిణాసియాలో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో మాత్రమే ఇది ఉంది.

ఈ టెక్నాలజీ  శరీరంపై ఎలాంటి కోతలు, రేడియేషన్, నొప్పి లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ కణజాలాన్ని తొలగిస్తుంది. మూత్రనాళం ద్వారా నియంత్రిత అల్ట్రాసౌండ్ శక్తిని పంపి కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే ఇది నాశనం చేస్తుంది. అమెరికా ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ దీనికి ఆమోదం తెలిపిందని డీఎస్ఎస్​ ప్రకటించింది.