హైదరాబాద్, వెలుగు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ విభాగం తన16వ ప్రాపర్టీ షో 2026ను అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనుంది. ఈ మెగా రియల్ ఎస్టేట్ ప్రదర్శనలో గృహ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్ల అవసరాలకు తగినట్లుగా రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ప్లాటెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు.
నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐటీ, జీసీసీల విస్తరణతో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో డెవలపర్లు, బిల్డర్లు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, భవన నిర్మాణ సామగ్రి సరఫరాదారులను ఒకే వేదికపైకి తెస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుదారులు నేరుగా బిల్డర్లతో మాట్లాడి నచ్చిన ఆస్తులను ఎంచుకోవడానికి ఇది గొప్ప అవకాశమని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
