లక్నో: మహిళలతో పిల్లలను కని, ఆ తర్వాత వారిని ఒంటరిగా వదిలేయవద్దని యువతకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ హితవు పలికారు. గురువారం లక్నోలోని మహర్షి యూనివర్సిటీ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యువత మొదట ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ‘
‘గర్ల్‌ఫ్రెండ్ ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. ఒకరిని గర్ల్‌ఫ్రెండ్‌గా చేసుకుంటే, వారిని వివాహం కూడా చేసుకోండి. ఒక అమ్మాయిని తల్లిని చేసిన తర్వాత ఆమెను వదిలేయడం తప్పు. యువత, ముందుగా మీ సొంత కాళ్లపై నిలబడం నేర్చుకోవాలి’’ అని ఆనందీబెన్ స్పష్టం చేశారు.
