మద్యం మత్తులో గొడవ ..రాడ్ తో కొట్టి ఫ్రెండ్ ప్రాణాలు తీశాడు.. డబీర్ పురా పీఎస్ పరిధిలో ఘటన

మద్యం మత్తులో గొడవ  ..రాడ్ తో కొట్టి ఫ్రెండ్ ప్రాణాలు తీశాడు.. డబీర్ పురా పీఎస్ పరిధిలో ఘటన

డబీర్​పురా వెలుగు : డబీర్​పురా పీఎస్​పరిధిలోని చంచల్​గూడ ఎంఏఎం ప్యాలెస్​ఫంక్షన్​హాల్ వెయిటర్​ ను..వెయిటర్​పని చేసే ఫ్రెండ్​రాడ్​తో కొట్టి చంపేశాడు. గురువారం తెల్లవారుజామున సందీప్​ జాదవ్​(35) అనే వెయిటర్​యూపీకి చెందిన నయీం బాబా (28) అనే వెయిటర్​తో కలిసి మద్యం తాగాడు.

 వీరిద్దరూ ఎప్పటినుంచో ఫ్రెండ్స్​...అయితే, అంతకుముందే వీరిద్దరికి ఏదో విషయంలో గొడవ జర గడంతో చర్చకు వచ్చింది. ముదరడంతో నయీమ్ ​ఇనుప రాడ్డుతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సందీప్​ను దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. పరారీలో ఉన్నాడని సీఐ ఉమాశంకర్​ తెలిపారు.