శ్రీనివాస్ భోగిరెడ్డి, మోహిత్, లావణ్య, వివాన్ సూర్య ప్రధాన పాత్రల్లో శాంతి కుమార్ దర్శకత్వం వహిస్తూ రామానుజ రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘3 2 1.. లవ్ మ్యారెజ్ వర్సెస్ ఆరేంజ్డ్’. అక్టోబర్ 23న సినిమా విడుదల కానుంది. తాజాగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఇదని, ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. మూడు ముళ్ళు, రెండు హృదయాలు, ఒక జీవితం కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రానికి ‘3 2 1’ అనే టైటిల్ పెట్టామని దర్శక, నిర్మాత శాంతి కుమార్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
