జనరిక్ మందులు పన్జేయవని ఎవలన్నరు..వాటి వినియోగం పెరగాలి

జనరిక్ మందులు పన్జేయవని ఎవలన్నరు..వాటి వినియోగం పెరగాలి
  • వారధి స్వచ్చంద సంస్థ  చైర్మన్​సుబ్బారావు 

పంజాగుట్ట, వెలుగు : జనరిక్​మందులపై అపోహలు వద్దని, అవి పన్జేయవు అనేవి తప్పుడు మాటలని, వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని వారధి స్వచ్ఛంద సంస్థ చైర్మన్​కట్టమూరి సుబ్బారావు అన్నారు. గురువారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘జనరిక్​మందులు, బ్రాండెడ్​ మందులకు తేడా’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. 

అసలు జనరిక్​మందులకు, బ్రాండెడ్​ మందులకు ఎటువంటి తేడా లేదని, రెండింటిలోనూ సేమ్​మందే ఉంటుందన్నారు. జనరిక్​మందులపై జనాల్లో ఉన్న అపోహలతో డాక్టర్లు కూడా బ్రాండెడ్ మందులనే సిఫారసు చేస్తున్నారన్నారు. 

నిరుద్యోగ యువతకు రూ. 2 లక్షలు..

ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా 149 జనరిక్​ మందుల షాపులు ఉన్నాయని, వీటిని విస్తరించేందుకు ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రూ.2 లక్షల నిర్వహణ వ్యయాన్ని ఉచితంగా అందజేస్తోందన్నారు. అతి తక్కువ ధరకు దొరుకుతాయని, అయినా మందు విషయంలో ఎలాంటి తేడా  ఉండదని ..కాబట్టి అందరూ జనరిక్​ మందులనే వాడాలన్నారు. వారధి సంస్థ సభ్యులు ఎం.రవీంద్ర విక్రమ్​, తేజస్విని శ్రీనివాస్​, రఘువీర్​ పాల్గొన్నారు.