ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనలు.. అక్టోబర్ 23 నుంచి వచ్చే నెల వరకు నిరసనలు

 ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనలు..  అక్టోబర్ 23  నుంచి వచ్చే నెల వరకు నిరసనలు

ఓయూ, వెలుగు : ఓయూలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగులకు ఆర్థిక, సర్వీస్ ప్రయోజనాలను కల్పించాలని నాన్ టీచింగ్ స్టాఫ్ జేఏసీ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్​ను ఓయూ అడ్మినిస్ట్రేటివ్​బిల్డింగ్​వద్ద విడుదల చేశారు.

 కమిటీ చైర్మన్ డాక్టర్ బి కుమార్, కో చైర్మన్ కె ఎస్ నాగరాజ రావు, ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్ ఖాన్, జనరల్ సెక్రటరీ బి వెంకటేశ్​మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానం అమలు, పెండింగ్‌ పదోన్నతులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం దశలవారీ ఆందోళనలకు పిలుపునిస్తున్నామని తెలిపారు. 

అక్టోబర్‌23 నుంచి ప్రారంభమయ్యే నిరసనలు మొదలుపెడతామని, పరిష్కారం కాకపోతే నవంబర్‌17 నుంచి నిరాహారదీక్షలకు దిగుతామని హెచ్చరించారు. జేఏసీ ప్రతినిధులు అక్బర్ బేగ్, పవన్ కుమార్,విఠల్ గౌడ్ తో పాటు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.