వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి.. బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5వేల ఉద్యోగాల కోత

వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి.. బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5వేల ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాంకింగ్ కంపెనీ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్ ఈ ఏడాది సుమారు 5,000 ఉద్యోగాలను తొలగిస్తోంది.  మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5 శాతానికి సమానం. ఏఐ వంటి టెక్నాలజీలతో ఖర్చులను తగ్గించుకుని, రాబడులను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా బ్యాంకు ఈ చర్యలు చేపట్టింది.

కంపెనీ ఇప్పటికే 1,000 మందిని తొలగించింది. మిగిలిన 4,000 ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను ఈ ఏడాది నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి పూర్తి చేస్తారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీ వినియోగం పెరగడంతో సాంప్రదాయ ఉద్యోగాల అవసరం తగ్గుతోందని బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్ పేర్కొంది.