హునార్ AIలో హాఫ్ వీసీ రూ.3 కోట్ల పెట్టుబడి

హునార్ AIలో హాఫ్ వీసీ రూ.3 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సెబీ రిజిస్టర్డ్ కేటగిరీ 1 వెంచర్ క్యాపిటల్ ఫండ్ హాఫ్ వీసీ తాజాగా కన్వర్జేషనల్ ఏఐ కంపెనీ హునార్ ఏఐలో రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఏఐ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెట్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. హునార్ వాయిస్, వాట్సాప్ ద్వారా వివిధ భాషల్లో ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఉద్యోగుల నియామకం, శిక్షణ, నిర్వహణ కోసం ఏఐ ఏజెంట్లను రూపొందిస్తోంది.

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ డిజిటల్ టీవీలో విళా చానెల్
 తమిళ ప్రేక్షకుల కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ డిజిటల్ టీవీ తమ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సోనీ విళా అనే కొత్త తమిళ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఛానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. స్థానిక సంస్కృతి, రోజువారీ జీవితాన్ని ప్రతిబింబించే కుటుంబ కథా చిత్రాలు, రియాలిటీ షోలు, సరికొత్త కార్యక్రమాలను ఈ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. తమిళ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కుటుంబమంతా కలిసి చూసేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు ఛానల్ నంబర్ 778లో సోనీ విళాను వీక్షించవచ్చు.

రెండో క్వార్టర్లో దుమ్మురేపిన సైయంట్
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గ్లోబల్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్ ఇంజినీరింగ్ సంస్థ సైయంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.153 కోట్ల నికర లాభం వచ్చింది. గత క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 8.7 శాతం పెరిగింది. ఆపరేటింగ్ లాభం రూ.237 కోట్లు ఉంది. మార్జిన్ 14.2 శాతంగా నిలిచింది. గడిచిన 10 త్రైమాసికాలలో ఇది అత్యధికం. డీఈటీ విభాగం రాబడి రూ.1664 కోట్లకు చేరింది. ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 8.1 శాతం, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 15.7 శాతం ఎక్కువ. వాటాదారులకు  రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించారు.