స్విగ్గీ నష్టం రూ.922 కోట్లు.. ఆదాయం రూ.7,571 కోట్లు

స్విగ్గీ నష్టం రూ.922 కోట్లు.. ఆదాయం రూ.7,571 కోట్లు

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ స్విగ్గీ ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2)లో తన నష్టాలను తగ్గించుకుంది. కంపెనీ రెవెన్యూ పెరగడంతో గతేడాది క్యూ2లో నమోదైన రూ.1,092 కోట్ల నష్టంతో పోలిస్తే, ఈసారి నష్టం రూ.922 కోట్లకు దిగొచ్చింది. సంస్థ ఆదాయం ఏడాది లెక్కన  రూ.5,561 కోట్ల నుంచి రూ.7,571 కోట్లకు పెరగ్గా, ఖర్చులు సైతం రూ.6,711 కోట్ల నుంచి రూ.8,703 కోట్లకు పెరిగాయి.

ఫుడ్ డెలివరీ గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్ విలువ (జీఓవీ) 17.7శాతం వృద్ధితో రూ.10,054 కోట్లకు చేరిందని  సీఈఓ శ్రీహర్ష మాజేటి తెలిపారు. బడ్జెట్ భోజనాల 'టాయింగ్'  ద్వారా కొత్త వృద్ధి నమోదవుతోందన్నారు. క్విక్ కామర్స్ (ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టామార్ట్) ఆర్డర్ విలువ 31.4శాతం పెరిగి రూ.6,954 కోట్లకు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కొత్తగా 69 డార్క్ స్టోర్లను జోడించడంతో వీటి మొత్తం సంఖ్య 1,240కి చేరింది.

జొమాటోకు లాభాలు
జొమాటో,  బ్లింకిట్ పేరెంట్ కంపెనీ  అయిన ఎటర్నల్ క్యూ2లో  రూ.125 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సాధించింది.  గతేడాది ఇదే  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన రూ.65 కోట్లతో పోలిస్తే ఇది 92.3శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే లాభం సుమారు 36శాతం పెరిగింది. కంపెనీకి కార్యకలాపాల ద్వారా రూ.24,138 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఏడాది లెక్కన  78శాతం ఎక్కువ.