రిలీజ్ డేట్స్ మార్చడం చిన్న చిత్రాలకు ఇబ్బంది: ‘సమ్మర్ హాలిడేస్‌‌’ సినిమా ప్రొడ్యూసర్

రిలీజ్ డేట్స్ మార్చడం చిన్న చిత్రాలకు ఇబ్బంది: ‘సమ్మర్ హాలిడేస్‌‌’ సినిమా ప్రొడ్యూసర్

మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌‌లో రూపొందిన  చిత్రం ‘సమ్మర్ హాలిడేస్‌‌’.  శ్రీకర్‌‌‌‌ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అదే తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో నవంబర్ 6కు వాయిదా వేశారు.

ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘అక్టోబర్‌‌‌‌లోనే మా సినిమా రిలీజ్‌‌కు కొన్ని డేట్స్ అనుకున్నాం కానీ కుదరలేదు.  చిన్న సినిమాలకు సరైన విడుదల తేదీ ఎంతో ముఖ్యం. పెద్ద సినిమాల మీద వేసి ఇబ్బంది పడే కంటే మంచి రిలీజ్ డేట్‌‌కు తీసుకురావాలని వెయిట్ చేశాం.

రిలీజ్ డేట్స్ మార్చుకోవడం మాకూ ఇబ్బందిగానే ఉంది. ఫైనల్‌‌గా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.  ఇది కేవలం పిల్లల సినిమా మాత్రమే కాదు, అన్ని వయసుల వారిని ఆకట్టుకునే నోస్టాల్జిక్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్’ అని చెప్పారు.

దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ ‘దీపావళికి ఇదొక మంచి ఎంటర్‌‌‌‌టైనర్.  ఇద్దరు పిల్లలతో  అన్ని ఏజ్ గ్రూప్‌‌లకు నచ్చేలా సినిమా తీశాం’ అని చెప్పాడు.  చిన్ననాటి జ్ఞాపకాలు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరితో ముడిపడిన అనుభూతులను గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంటుందని చైల్డ్ ఆర్టిస్టులు రోహన్, అరుణ్ అన్నారు.