బెంగళూరులోని బాగల్గుంటె బైరవేశ్వరనగర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాము పక్కలో వచ్చి పడుకున్న ఘటన కలకలం రేపింది. యువతి ఇంట్లో కింద పరుపుపై నిద్రిస్తుండగా తన పక్కనే ఒక నాగుపాము తిరుగుతోందన్న విషయం ఆమెకు తెలియదు. ఉదయం ఆ యువతి హెయిర్‌పిన్ కోసం వెతుకుతుండగా, ఆమె దిండు కింద ఒక పెద్ద నాగుపాము కనిపించింది.
ರಾತ್ರಿ ಇಡೀ ನಾಗರ ಹಾವಿನ ಮೇಲೆ ಮಲಗಿದ್ದ ಅಣ್ಣ ತಂಗಿ.. #snake #statenews.live https://t.co/roA4Fq44BU
— StateNews.Live (@StateNewsIND) October 23, 2026
దీంతో బిత్తరపోవడం ఆమె వంతయింది. ఈ ఘటన బైరవేశ్వరనగర్‌లోని రూపా అనే మహిళ ఇంట్లో జరిగింది. రాత్రి రూపా ఇద్దరు పిల్లలు వారి గదిలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో, నాగుపాము కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించింది. అయితే, గదిలో పాము తిరుగుతోందన్న విషయం రూప పిల్లలకు తెలియదు.
ఉదయం, రూప కూతురు తలలో పెట్టుకోవడానికి హెయిర్‌పిన్ కోసం వెతుకుతుండగా తాను పడుకున్న దగ్గర వెతుకుతుండగా, తన దిండు కింద ఉన్న నాగు పామును అనుకోకుండా తాకింది. భయంతో పరుగులు తీసిన ఆ యువతి, అప్పటికీ పక్కనే నిద్రపోతున్న అతని అన్నయ్యను నిద్ర లేపింది. భయంతో ఇద్దరూ బయటకు పరుగులు తీశారు. గదిలోంచి బయటకు వెళ్లి స్నేక్ క్యాచర్ నాగేంద్రకు సమాచారం ఇచ్చారు.
నాగేంద్రను పిలిచి విషయం చెప్పారు. నాగేంద్ర వెంటనే అక్కడికి చేరుకుని నాగుపామును రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. రాత్రంతా నాగుపాముతో పాటు నిద్రపోయిన అన్న, చెల్లి ఉదయం ఈ విషయం తెలిసి విస్తుపోయారు. ఎవరినీ కాటు వేయకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
