ఖమ్మం కలెక్టరేట్ దగ్గర తృటిలో పెను ప్రమాదం తప్పింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్దమైంది. శుక్రవారం ( అక్టోబర్ 23 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. దసరా పండగకు ఊరెళ్ళినవారు ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తుండగా జరిగింది ఈ ప్రమాదం.
కారు ఖమ్మం కలెక్టరేట్ దగ్గరికి చేరుకోగానే కారు నుంచి పొగలు వచ్చాయని.. ఇది గమనించి వెంటనే బయటికి వచ్చానని అంటున్నారు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి. సమయానికి బయటికి రావడంతో ప్రాణ నష్టం తప్పిందని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.
ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే.. కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
