టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్

India vs New Zealand: క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ (Bowling First) తీసుకున్నాడు. మ్యాచ్‌లో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉండటంతోనే బౌలింగ్ తీసుకున్నట్లు శ్రేయస్ తెలిపారు. అలాగే జట్టులో రెండు మార్పులు చేసినట్లు ప్రకటించగా, కివీస్ టీమ్ ఒక మార్పుతో బరిలోకి దిగబోతుంది.  

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇక్కడ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి బౌలింగ్ తీసుకున్నాం.. తొలి మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దక్కింది. జట్టులోని అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. దూకుడుతో పాటు వ్యూహాత్మకంగా మైదానంలో రాణించడమే మా లక్ష్యం అని పేర్కొన్నాడు. 

న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. అయితే గత మ్యాచ్‌లో ఓడినా, మేము మంచి ప్రదర్శనే చేశాం.. రాబోయే టెస్ట్ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ బౌలర్ల రొటేషన్‌లో భాగంగా ఆడమ్ మిల్నే స్థానంలో డఫీ (Duffy)ని తుది జట్టులోకి తీసుకున్నట్లు శాంట్నర్ తెలిపాడు. 

జట్లు:

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్

భారత జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్