బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌పైనే దృష్టి..ఇవాళ(అక్టోబర్ 24) న్యూజిలాండ్‌‌‌‌తో ఇండియా రెండో టీ20

బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌పైనే దృష్టి..ఇవాళ(అక్టోబర్ 24) న్యూజిలాండ్‌‌‌‌తో ఇండియా రెండో టీ20
  • ఇషాన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో వైభవ్‌‌‌‌ సూర్యవంశీ!
  • మ. 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

క్రైస్ట్‌‌‌‌చర్చ్: తొలి టీ20లో గెలిచి జోరుమీదున్న ఇండియా.. రెండో మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. శనివారం జరిగే ఈ పోరులో టీమిండియా బౌలర్లపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఎందుకంటే బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలించే క్రైస్ట్‌‌‌‌చర్చ్‌‌‌‌ పిచ్‌‌‌‌పై కివీస్‌‌‌‌ హిట్టర్లను కట్టడి చేయడం బౌలర్లకు సవాల్‌‌‌‌గా మారనుంది. తొలి మ్యాచ్‌‌‌‌లో బ్యాటర్లు అద్భుతంగా ఆడటంతో 226 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ బౌలింగ్‌‌‌‌ లోపాలు ఇండియా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఐదు, ఆరో బౌలింగ్‌‌‌‌ ఆప్షన్లు జట్టుకు తలనొప్పిగా మారాయి. ఆల్‌‌‌‌రౌండర్లు రాణించకపోవడం, హార్దిక్‌‌‌‌ పాండ్యా గాయం వల్ల అందుబాటులో లేకపోవడం హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఇబ్బందికరంగా మారింది. 

పవర్‌‌‌‌ప్లేలో అలెన్‌‌‌‌, సీఫెర్ట్‌‌‌‌ చెలరేగడంతో ఇండియా పేసర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. గాయం కారణంగా ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌కు దూరమయ్యాడు. దాంతో 15 ఏళ్ల వైభవ్‌‌‌‌ సూర్యవంశీ బరిలోకి దిగే చాన్స్‌‌‌‌ ఉంది. అభిషేక్‌‌‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌‌‌ను ప్రారంభించే అవకాశం ఉంది. శాంసన్‌‌‌‌ మూడో,  తిలక్‌‌‌‌ ఐదో ప్లేస్‌‌‌‌లో ఆడనున్నారు. మరోవైపు కివీస్‌‌‌‌ కూడా ఈ మ్యాచ్‌‌‌‌ కోసం అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసింది. స్పిన్నర్లు  మిచెల్‌‌‌‌ శాంట్నర్‌‌‌‌,  బ్రాస్‌‌‌‌వెల్‌‌‌‌ మిడిల్ ఓవర్లలో ఇండియా బ్యాటర్లను కట్టడి చేయాలని చూస్తున్నారు. టీమిండియా లైనప్‌‌‌‌ పటిష్టంగా ఉండటంతో బౌలింగ్‌‌‌‌లో రకరకాల ఆప్షన్లను వెతుకుతున్నారు.