హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో నంబర్ 182 ద్వారా అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చారు. 2026-27 బడ్జెట్ కేటాయింపుల నుంచి ఈ నిధులు విడుదల చేయనున్నారు. క్యాంపస్‌లో విద్యార్థులకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
135 మంది గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన 11 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న 135 మంది గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాల కోసం ప్రభుత్వం రూ.4.54 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 180 జారీ చేసింది. గెస్ట్ లెక్చరర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సంబంధిత అధికారులకు సూచించింది.
