- సోన్ మండలం కడ్తాల్ వద్ద ఘటన
నిర్మల్, వెలుగు: ఆంబులెన్స్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఝరి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అంబులెన్స్ లో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. కడ్తాల్ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఓ లారీ అతివేగంగా వీరి అంబులెన్సు ను ఢీకొట్టడంతో అందులోని సరస్వతి(22), పారుబాయి(52) అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్ స్థానిక పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
