నాపై, వీడీ సతీశన్‌‌‌‌‌‌‌‌ పై స్టింగ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ కు కుట్ర.. ‘మెటా’స్మార్ట్‌ గ్లాసెస్‌ తో ట్రాప్‌ చేసే యత్నం:కర్నాటక సీఎం డీకే శివకుమార్‌

నాపై, వీడీ సతీశన్‌‌‌‌‌‌‌‌ పై స్టింగ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ కు కుట్ర.. ‘మెటా’స్మార్ట్‌ గ్లాసెస్‌ తో ట్రాప్‌ చేసే యత్నం:కర్నాటక సీఎం డీకే శివకుమార్‌

బెంగళూరు: దక్షిణాదిలోని కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ‘స్టింగ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్’ కుట్ర జరుగుతోందంటూ కర్నాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచనలం సృష్టిస్తున్నాయి. తనతో పాటు కేరళ సీఎం వీడీ సతీశన్‌‌‌‌‌‌‌‌ను కూడా ట్రాప్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. 

ఎన్డీయేకి చెందిన ఏ ఒక్క ముఖ్యమంత్రిని కూడా ఇలా టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేయలేదని ఆయన అన్నారు. స్థానిక కన్నడ ఛానెల్ ‘ఏషియానెట్ సువర్ణ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక బిజినెస్‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌ నన్ను కలిసేందుకు అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుని వచ్చారు. 

మొదట వ్యాపార విషయాలపై మాట్లాడిన ఆ వ్యక్తి.. క్రమంగా బూత్ స్థాయి రాజకీయ వ్యూహాలు, సున్నితమైన అంశాల వైపు చర్చను మళ్లించారు. ఆయన ధరించిన ‘మెటా స్మార్ట్ గ్లాసెస్’(రహస్య కెమెరా, రికార్డింగ్‌‌‌‌‌‌‌‌ సదుపాయం ఉండే అద్దాలు)పై, ఆయన మాటలపై అనుమానం వచ్చింది. దీంతో ఆయన నేపథ్యంపై నిఘా వేయాలని అధికారులను ఆదేశించాను’’అని డీకే వివరించారు. 

అయితే, విచారణలో ‘‘అదే బిజినెస్ మ్యాన్‌‌‌‌‌‌‌‌ ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌‌‌‌‌‌‌తో పాటు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు మెటా గ్లాసెస్  ధరించలేదు. దీని వెనుక ఉన్నదెవరో సమయం వచ్చినప్పుడు చెప్తా" అని పేర్కొన్నారు.