సదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటర్ లిస్ట్‌ ‌‌‌‌‌‌‌లో భారీ గోల్‌ ‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌ ..ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ లో ఇద్దరు ఎస్డీఎంలపై వేటు

సదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటర్ లిస్ట్‌ ‌‌‌‌‌‌‌లో భారీ గోల్‌ ‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌ ..ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ లో ఇద్దరు ఎస్డీఎంలపై వేటు
  • 13,150 ఓట్ల వివరాలు తారుమారు
  • సీబీఐ విచారణకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని పిలిభిత్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వెలుగుచూసిన అవకతవకలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎపిక్  నంబర్లు అవే ఉన్నప్పటికీ.. ఓటర్ల పేర్లు మార్చేసిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నది. 

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పురాన్‌‌‌‌‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌ ఎస్డీఎం మయాంక్‌‌‌‌‌‌‌‌ గోస్వామి, అమరియా ఎస్డీఎం హేమంత్‌‌‌‌‌‌‌‌ చౌదరిపై వేటు వేసింది. వారిని  జిల్లా హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న కంప్యూటర్ ఆపరేటర్ అనిల్ ను శాశ్వతంగా డ్యూటీలోంచి తొలగించారు.

కుట్రపూరితంగా పేర్ల మార్పు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తుది జాబితా వెలువడిన అనంతరం.. దాదాపు 13,150 మంది ఓటర్ కార్డులను మార్చేసినట్టు విచారణలో రుజువైంది. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు అందడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ స్పందించి విచారణకు ఆదేశించడంతో అధికారుల బండారం బయటపడింది. 

ముస్లిం ఓటర్లే టార్గెట్: సుప్రియా శ్రీనాటే

ఈ కుంభకోణంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే స్పందిస్తూ..ఒక వ్యూహం ప్రకారం ముస్లిం పురుష ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమో.. మార్చడమో చేశారని మండిపడ్డారు. జులై–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ మధ్య 2,600 మంది కొత్త ఓటర్లను అడ్డగోలుగా చేర్చారని, 804 మంది పేర్లను తొలగించారని ఆమె పేర్కొన్నారు.  మొత్తంగా 16 వేలకు పైగా ఓట్లలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు.

జిల్లావ్యాప్తంగా తనిఖీలకు ఆదేశం

సదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం నుంచి ప్రస్తుత యూపీ ప్రభుత్వ మంత్రి సంజయ్ గంగ్వార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2022 ఎన్నికల్లో కేవలం 6,920 ఓట్ల స్వల్ప తేడాతోనే విజయం సాధించారు. అంత స్వల్ప మెజారిటీ ఉన్న స్థానంలో 13 వేలకు పైగా ఓట్ల వివరాలు తారుమారు కావడం తీవ్ర దుమారానికి దారితీసింది. 

కాంగ్రెస్ నేత కుముద్ గంగ్వార్ ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా, అధికార పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఈ కుట్ర చేశారని సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పిలిభిత్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల ఓటర్ల జాబితాలను 48 గంటల్లోగా సమగ్రంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. 

కాగా, వేటు పడిన ఎస్డీఎం మయాంక్‌‌‌‌‌‌‌‌ గోస్వామిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాంపూర్ జిల్లా బిలాస్‌‌‌‌‌‌‌‌పూర్ నుంచి పిలిభిత్‌‌‌‌‌‌‌‌కు బదిలీపై వచ్చిన ఆయన, అమరియా ఎస్డీఎంగా ఉన్నప్పుడు లారీ డ్రైవర్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని, అవినీతికి వ్యతిరేకంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.