మాదాపూర్ సున్నం చెరువు దగ్గర అక్రమం బోర్లు,  మోటార్లు తొలగించిన హైడ్రా 

మాదాపూర్ సున్నం చెరువు దగ్గర అక్రమం బోర్లు,  మోటార్లు తొలగించిన హైడ్రా 

మాదాపూర్ లోని సున్నం చెరువు పరిధిలో చెరువు భూములను భూగర్భ జలాలను అన్యాక్రాంతం చేస్తూ సాగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపింది హైడ్రా.శనివారం ( అక్టోబర్ 24 ) సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ బోర్లు, మోటార్లు, పైప్ లైన్లు, షెడ్లను తొలగించారు హైడ్రా అధికారులు. 

స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్విన బోర్లు, మోటార్లు, నీటి సంపులు మరియు షెడ్లను తొలగించారు. 

ఈ చెరువు ప్రాంతం నుంచి భూగర్భ జలాలను అనధికారికంగా తోడి, ట్యాంకర్ల ద్వారా మాదాపూర్‌లోని ఐటీ కంపెనీలు, హోటళ్లు, ప్రైవేట్ హాస్టళ్లు, విద్యాసంస్థలకు వాణిజ్యపరంగా నీటిని సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు హైడ్రా అధికారులు.చెరువులు, కుంటలు ఆక్రమిస్తే సహించేది లేదని.. ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.